‘అరణ్య’ క్లోజింగ్ కలెక్షన్స్..ఎన్ని కోట్లు న‌ష్ట‌మంటే?

రానా ద‌గ్గుబాటి, ప్రభు సాల్మన్ కాంబోలో తెర‌కెక్కిన చిత్రం `అర‌ణ్య‌`. ఏరోస్‌ ఇంటర్నేషనల్ బ్యాన‌ర్‌పై నిర్మించిన ఈ చిత్రంలో విష్ణు విశాల్‌, పులకిత్‌ సామ్రాట్‌, జోయా హుస్సేన్‌, రఘుబాబు తదితరులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. అడ‌వి, ఏడుగులు నేప‌థ్యంలో ఈ చిత్రం తెర‌కెక్కింది.

భారీ అంచ‌నాల న‌డుము మార్చి 26న విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డింది. ఫస్ట్ వీకెండ్‌లోనే ఈ చిత్రం ఫ్లాప్ అని తేలిపోగా.. దారుణంగా క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అరణ్య సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి.

నైజాం- 1.02 కోట్లు, సీడెడ్- 0.48 కోట్లు, ఉత్తరాంధ్ర- 0.52 కోట్లు, ఈస్ట్- 0.30 కోట్లు, వెస్ట్- 0.22 కోట్లు, గుంటూరు- 0.40 కోట్లు, కృష్ణా- 0.27 కోట్లు, నెల్లూరు- 0.13 కోట్లు క‌లెక్ట్ చేసింది. అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1.52 కోట్లు, ఓవర్సీస్ లో 0.24 కోట్లు వ‌చ్చాయి. దీంతో వ‌రల్డ్ వైడ్‌గా రూ.5.10 కోట్లును అర‌ణ్య క‌లెక్ట్ చేసింది. అయితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 19 కోట్లు వసూలు చేయాలి. కానీ కేవలం 5 కోట్ల దగ్గరే ఈ చిత్రం ఆగిపోవ‌డంతో.. 14 కోట్లు న‌ష్టం వాటిల్లింది.