బ్రేకింగ్ : జగన్ కు షాక్ ఇచ్చిన ఎంపీ రఘురామ..!?

వైసీపీ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సి‌ఎం జగన్ మోహన్ రెడ్డికి పెద్ద షాక్ ఇచ్చారు. సి‌ఎం జగన్ పై ఉన్న బెయిల్ ను రద్దు చేయాలంటూ రఘురామ సీబీఐ కోర్టు లో పిటిషన్ చేసారు. జగన్ కేసుల్లో విచారణ చాలా లేటుగా జరుగుతుందని, అందువల్ల బెయిల్ రద్దు చేయాలని రఘురామ పిటిషన్ లో తెలిపారు. కేవలం ప్రజాస్వామ్యాన్ని, పార్టీని రక్షించుకునేందుకే సీబీఐ కోర్ట్ లో తాను పిటిషన్ వేసినట్లు రఘురామ పేర్కొన్నారు.

జగన్ మోహన్ రెడ్డి నిర్దోషిగా బయటకు రావాలనే ఆయన కోరుకుంటున్నట్టు చెప్పారు. ఒక సంవత్సరంగా జగన్ కోర్ట్ కు హాజరు కాకపోతే ఎవరు అడగరా అంటూ ఆయన ప్రశ్నించారు. వివేకా హత్య కేసులో గొడ్డలి పోటును గుండె పోటుగా ఎలా అంటారని రఘురామ నిలదీశారు. నిజాలను బయట పెట్టేందుకే తాను సీబీఐ కోర్ట్ లో పిటిషన్ వేసినట్లు ఎంపీ రఘురామ కృష్ణం రాజు మీడియా సమావేశం లో తెలిపారు.

Share post:

Latest