కరోనా వైరస్ విషయంలో బాలీవుడ్ బ్యూటీ జాగ్రత్తలు..!!

దేశంలో సగానికి పైగా కేసులు మహారాష్ట్రలో నమోదు అవుతున్న సంగతి అందరికి తెలిసిందే.ఈ క్రమంలో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం అక్కడ లాక్ డౌన్ విధించింది. పరిస్థితి ఇలా ఉండగా తాజాగా మహారాష్ట్ర లో సెకండ్ వేవ్ తీవ్రత ను ఉద్దేశించి బాలీవుడ్ టాప్ హీరోయిన్ ప్రియాంక చోప్రా సోషల్ మీడియా ద్వారా పలు సూచనలు ఇచ్చింది. ఇళ్ల నుండి అవసరమైతే తప్ప ఎవరు బయటకు రావద్దని, ఒకవేళ వచ్చినా కచ్చితంగా మాస్క్ ధరించాలంటూ చెప్పింది.

- Advertisement -

కరోనా తగ్గిపోయింది అన్న రీతిలో గత కొంత కాలంగా ప్రజలందరూ కరోనా నిబంధనలు పాటించకుండా ఉన్నారని, అందువల్లే ప్రస్తుతం వైరస్ ఇలా వేగంగా విజృంభిస్తుంది అని చెప్పింది. కొన్ని రాష్ట్రాలలో పరిస్థితి చూస్తే, చేయి దాటి పోయినట్టు అనిపిస్తుంది అంటూ ఆవేదన వ్యక్తం చేసింది ప్రియాంక చోప్రా.కాబట్టి ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు తప్పకుండా పాటించాలని సూచించింది. ఇలాంటి క్లిష్ట సమయంలో చుట్టు పక్కల వారికి చేతనయినా సాయం చేయాలని అలాగే వ్యాక్సిన్ ప్రతి ఒక్కరు వేయించుకోవాలి అని ప్రియాంక చోప్రా తెలిపింది.

Share post:

Popular