ఆనందంతో గాల్లో తేలుతున్న ప్రియ‌మ‌ణి..కార‌ణం అదేన‌ట‌!

ప్రియ‌మ‌ణి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఎవరే అతగాడు` సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. తక్కువ సమయంలోనే టాలీవుడ్‌, కోలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోను మంచి గుర్తింపు తెచ్చుకుంది. స్టార్ హీరోల స‌ర‌స‌న ఆడిపాడిన ప్రియ‌మ‌ణి లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాల్లోనూ నటించి స‌త్తా చాటింది.

ఇక నటనతో పాటు అందాల ఆర‌బోత‌లోనూ ప్రియమణి రూటే సెపరేటు అన‌డంలో సందేహం లేదు. ఇప్పుడు వెంక‌టేష్ `నార‌ప్ప‌`, రానా `విరాటపర్వం` చిత్రాల్లో న‌టిస్తున్న ఈ ముద్దుగుమ్మ‌.. వెబ్ సిరీస్ కూడా చేస్తోంది. అలాగే మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో కూడా య‌మా యాక్టివ్‌గా ఉంటుంది. ఇదిలా ఉంటే.. ప్రియ‌మ‌ణి ప్ర‌స్తుతం ఆనందంతో గాల్లో తేలిపోతుంది.

ఇందుకు కార‌ణం.. త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవ‌ర్స్ సంఖ్య 1 మిలియ‌న్ దాటింది. అందుకే ప్రియ‌మ‌ణి ఫుల్ ఖుషీ అవుతోంది. ఈ క్ర‌మంలోనే త‌న ఫాలోవ‌ర్స్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతూ.. ఇన్‌స్టాలో ఓ చిన్న వీడియో షేర్ చేసింది. ప్ర‌స్తుతం ఈ వీడియో వైర‌ల్ అవుతోంది.

https://www.instagram.com/p/CNR5JNkBE2z/?utm_source=ig_web_copy_link

Share post:

Latest