ఐపిఎల్ కోసం దీక్ష చేసిన ఖైదీలు..ఎక్కడంటే..?.

April 14, 2021 at 1:36 pm

ఐపిఎల్ మ్యాచ్‌లంటే దేశంలో చాలమందికి ఫుల్ క్రేజ్. ముఖ్యంగా యువతకు క్రికెట్‌ను చూడకుండా ఉండలేరు. అయితే ఇధి సాధరణ ప్రజల నుండి జైళ్లో ఉండే ఖైదీలకు కూడ ఈ క్రేజ్ సోకింది. తాము జైలులో ఉన్నా, తమకు కూడా అన్ని హక్కులు ఉంటాయని, అందుకే తాము కూడ ఐపిఎల్ మ్యాచ్‌లు చూస్తామని ఖైదీలు అధికారులకు చెప్పారు. అయినా కూడా ఐపిఎల్ మ్యాచ్‌లను చూసే అవకాశం వాళ్ళకి కల్పించలేదు.

దీంతో తమకు ఐపిఎల్ మ్యాచ్‌లను చూసే వీలును కల్పించాలని ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్‌,ఫతేగఢ్ సెంట్రల్ జైలులోని ఖైదీలు నిరసనగా దీక్షకు దిగారు. తమకు మ్యాచ్‌లు చూసే అవకాశం కల్పించేవరకు టిఫిన్‌తో మానేస్తూ నిరసన వ్యక్తం చేశారు.దీంతో వెంటనే స్పందించిన జైలు సూపరిండెంట్ వారితో చర్చలు జరిపారు. చర్చల అనంతరం వాళ్ళకి మ్యాచ్‌లు చూసే వెసులుబాటును కల్పిస్తామని హామీ ఇచ్చాడు. దీంతో ఖైదీలు అంతా దీక్ష విరమించారు. మొత్తం జైళ్లో తమకు కావాల్సిన సౌకర్యాల కోసం అంటే ఆహారం ,వైద్య సేవలతో పాటు అధికారుల తీరు పై ఆందోళనలు నిర్వహించిన సంఘటనలు ఇదివరకు చాలా చూశాము కాని, జైళ్లో ఇలా క్రికెట్ మ్యాచ్లు కోసం నిరసన చేపట్టి తమ డిమాండ్‌ను సాధించుకోవడం పెద్ద చర్చనీయాంశంగా మారింది.

ఐపిఎల్ కోసం దీక్ష చేసిన ఖైదీలు..ఎక్కడంటే..?.
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts