ఇక ఇప్ప‌ట్లో అది జ‌ర‌గ‌న‌ట్టే.. తీవ్ర నిరాశ‌లో ప‌వ‌న్ ఫ్యాన్స్‌?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ లాంగ్ గ్యాప్ త‌ర్వాత ఇటీవ‌లె `వ‌కీల్ సాబ్` చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ప‌వ‌న్ చేతిలో అర‌డ‌జ‌న్ సినిమాలు ఉండ‌గా.. అందులో హరిహర వీరమల్లు, మలయాళ సూపర్ హిట్ సినిమా అయ్యప్పనం కోషియం తెలుగు రీమేక్ సెట్స్ మీద ఉన్నాయి. మిగతా ప్రాజెక్ట్స్ ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతున్నాయి.

ఒప్పుకున్న అన్ని సినిమాల‌ను శ‌ర‌వేగంగా పూర్తి చేయాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్న ప‌వ‌న్ ఇటీవలె క‌రోనా బారిన ప‌డ్డారు. దీంతో సెట్స్ మీద‌కు ఉన్న రెండు సినిమాల షూటింగ్‌కు బ్రేక్ ప‌డింది. అయితే క‌రోనా నుంచి కోలుకున్న త‌ర్వాత ప‌వ‌న్‌ మళ్లీ సెట్‌లో అడుగుపెడతారని భావించారు ఫ్యాన్స్‌. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించటం లేదు.

ఎందుకంటే, పవన్‌కు కరోనా నెగెటివ్‌ వచ్చినా… లంగ్స్‌లో ఇన్‌ఫెక్షన్ మాత్రం తగ్గలేదట. ఈ క్ర‌మంలోనే వైద్యులు ఆయ‌న‌ను బెడ్‌ రెస్ట్ తీసుకోవాలని సూచించారు. దీంతో ఇప్ప‌ట్లో షూటింగ్ జ‌రిగే ప‌రిస్థితి లేదు. ఫ‌లితంగా హరిహర వీరమల్లు, అయ్యప్పనం కోషియం తెలుగు రీమేక్ చిత్రాలు మ‌రింత ఆల‌స్యం కానున్నాయి. అందుకే ప‌వ‌న్ ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నార‌ని అంటున్నారు.

Share post:

Latest