మెగా హీరోతో సినిమా..ఓపెన్ అయిన నాగార్జున‌!

మెగా హీరో వైష్ణ‌వ్ తేజ్ `ఉప్పెన‌` చిత్రంతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్ట‌డ‌మే కాదు.. డ‌బ్యూ మూవీతో ఏ తెలుగు హీరో సాధ్యం కాని క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టి సూప‌ర్ డూప‌ర్ హిట్‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఉప్పెన విడుద‌ల‌కు ముందే క్రిష్‌తో రెండో సినిమా షూటింగ్‌ను పూర్తి చేసేశాడు వైష్ణ‌వ్‌. దీంతో ఈయ‌న మూడో సినిమా ఏ డైరెక్ట‌ర్‌తో ఉంటుందా అని అంద‌రూ ఆస‌క్తిక‌రంగా ఎదురు చూస్తున్నారు.

ఇలాంటి త‌రుణంలోనే అక్కినేని నాగార్జున నిర్మాతగా తన సొంత నిర్మాణ సంస్థ అన్నపూర్ణ ప్రొడక్షన్స్ బానర్‌పై వైష్ణ‌వ్‌తో ఓ సినిమా చేయ‌బోతున్నాడ‌ని ఆ మ‌ధ్య జోరుగా వార్త‌లు వ‌చ్చాయి. కానీ, క్లారిటీ మాత్రం రాలేదు. అయితే ఈ విష‌యంలో తాజాగా నాగ్ ఓపెన్ అయ్యాడు.

వైల్డ్ డాగ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో నాగ్ మాట్లాడుతూ..తాను మెగా వారసుడు వైష్ణవ్ తేజ్ తో సినిమా చేయబోతున్నట్టు ప్రకటించేశాడు. వైష్ణవ్ తేజ్ కు కథ చాలా బాగా నచ్చిందనీ, ఒక కొత్త దర్శకుడు ఈ సినిమాతో పరిచయం కానున్నాడని తెలిపిన నాగ్‌.. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్‌పై ప్ర‌క‌ట‌న కూడా ఉంటుంద‌ని వెల్ల‌డించారు.

Share post:

Popular