ఇస్మార్ట్ పోరికి బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చిన యంగ్ టైగ‌ర్‌?!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న `ఆర్ఆర్ఆర్‌` చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకోగా.. అక్టోబ‌ర్‌లో విడుద‌ల కానుంది. ఇక ఈ చిత్రం త‌ర్వాత ఎన్టీఆర్ స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌తో ఓ సినిమా చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే.

Nabha Natesh set to make her Telugu debut with Nannu Dochukunduvate- Cinema  express

నందమూరి కళ్యాణ్‌రామ్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా సినిమాగా ఈ మూవీ రూపొందించబోతున్నారు. ఏప్రిల్ 29వ తేదీ 2022న విడుద‌ల కానున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా కియ‌రా అద్వాని పేరు బ‌లంగా వినిపిస్తోంది.

ఇక ఈ చిత్రంలో మ‌రో హీరోయిన్ కూడా ఉండ‌నుంద‌ట‌. అయితే ఆ ఛాన్స్ ఇస్మార్ట్ శంక‌ర్ సినిమాతో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్న న‌భా న‌టేష్‌కు ద‌క్కిన‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే సంప్ర‌దింపులు కూడా పూర్తి అయ్యాయ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ వార్త‌లే నిజ‌మైతే.. న‌భాకు ఇది బంప‌ర్ ఆఫ‌ర్ అనే చెప్పాలి.

Share post:

Latest