వ్య‌వ‌సాయం చేస్తూ ఫుల్ బిజీగా గ‌డుపుతున్న స్టార్ హీరో!

క‌రోనా కార‌ణంగా లాక్‌డౌన్ రావ‌డంతో.. సినీ తార‌లంద‌రూ ఫుల్ ఫ్రీ అయిపోయారు. ఆ స‌మ‌యంలో కొంద‌రు తార‌లు ఖాళీగా ఉండ‌కుండా.. త‌మ‌కు న‌చ్చిన ప‌ని చేసుకుంటూ బిజీ మారారు. అలాంటి వారిలో మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ ఒక‌రు.

ఈయ‌న లాక్‌డౌన్ కాలంలో సేంద్రీయ వ్యవసాయం స్టార్ట్ చేసిన‌ట్టు అభిమానుల‌తో తెలిపిన సంగ‌తి తెలిసిందే. అయితే చెప్ప‌డ‌మే కాదు… చేసి చూపిస్తున్నారు. ప్రైవేట్ ఆర్గానిక్ ఫార్మ్ లో ప్ర‌స్తుతం ఈయ‌న ట‌మోటాలు, కాక‌ర‌కాయ‌లు, వంకాయ‌లు, మొక్క‌జొన్న‌లు ఇలా త‌న‌కు న‌చ్చిన పంట‌ల‌ను అన్నీ పండించారు.

తాజాగా ఇందుకు సంబంధించిన వీడియో పోస్ట్ చేసిన మోహ‌న్ లాల్‌..త‌న ఫ్యాన్స్ కూడా ఇంటి టెర్ర‌స్‌ల మీద, బాల్క‌నీల్లోనూ న‌చ్చిన పంట‌ల‌ను పండించాల‌ని పిలుపునిచ్చారు. మ‌రియు ఆర్గానిక్‌ ఫార్మింగ్ గురించి, అందులో ఉన్న లాభాల‌ను గురించి కూడా తెలిపారు. దీంతో మోహ‌న్ వీడియో వైర‌ల్‌గా మారింది.

https://www.facebook.com/watch/?v=290309615927191

Share post:

Latest