మహారాష్ట్ర ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం..!

మహారాష్ట్రలో అగ్నిప్రమాదాల సంభవించింది. బుధవారం ఉదయం థానేలోని ఓ ప్రైవేట్‌ హాస్పిటల్ లో మంటలు చెలరేగి నలుగురు రోగులు మరణించిన విషయం తెలిసిందే. తాజాగా రత్నగిరి జిల్లాలోని మహారాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి సంస్థ అయిన ఎంఐడీసీ లోని ఎంఆర్‌ ఫార్మా కంపెనీలో అగ్రిప్రమాదం సంభవించింది. ఎంఆర్‌ ఫార్మాలో ఇవాళ ఉదయం 11 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి కంపెనీ అంతా విస్తరించాయి.

ఈ వార్త అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. 45 నిమిషాలపాటు కష్టపడి మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్నిప్రమాదంతో ఆ ప్రాంతం మొత్తం దట్టమైన పొగలు అలుముకున్నాయి. ప్రమాద సమయంలో పరిశ్రమలో ఎనిమిది మంది శ్రామికులు ఉన్నారని, వారంతా క్షేమంగా బయట పడ్డారని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం వల్ల భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు వారు చెప్పారు. ఇంకా మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

 

 

 

<blockquote class=”twitter-tweet”><p lang=”en” dir=”ltr”><a href=”https://twitter.com/hashtag/WATCH?src=hash&amp;ref_src=twsrc%5Etfw”>#WATCH</a> | Maharashtra: Fire broke out in a pharmaceutical company, MR Pharma, in Ratnagiri&#39;s MIDC. It was later extinguished, no injuries/casualties reported. <a href=”https://t.co/6naTiJWN5j”>pic.twitter.com/6naTiJWN5j</a></p>&mdash; ANI (@ANI) <a href=”https://twitter.com/ANI/status/1387303026268934144?ref_src=twsrc%5Etfw”>April 28, 2021</a></blockquote> <script async src=”https://platform.twitter.com/widgets.js” charset=”utf-8″></script>

Share post:

Popular