దారుణం..పిల్లలను కట్టేసి పేడ తినిపించారు..వీడియో వైర‌ల్‌!

మ‌హబూబాబాద్ జిల్లా దారుణం చేటుసుకుంది. పెంపుడు కుక్క కనిపించట్లేదని వెతుకుతూ మామిడి తోట‌లోకి వ‌చ్చిన పిల్ల‌ల‌ను కాపలాదారులు దారుణంగా క‌ట్టేసి చిత‌క‌బాదారు. అంతేకాదు, స‌ద‌రు పిల్ల‌ల నోట్లో పేడ‌ని కుక్కి తినిపించారు.

పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరుకు చెందిన ఇద్దరు పిల్లలు తమ పెంపుడు కుక్క కనిపించడం లేదని వెతుక్కుంటూ ఒక మామిడి తోటకు వెళ్లారు. అక్కడ ఉన్న కాపలాదారులు ఆ పిల్లలు మామిడి కాయలు దొంగిలించేందుకు వచ్చినట్లుగా భావించి కట్టేసి చితక బాదారు. వారి నోట్లో బలవంతంగా పేడను కుక్కి తినిపించారు.

దీన్నంతా ఓ వ్య‌క్తి వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా.. అది కాస్త వైర‌ల్‌గా మారింది. మ‌రోవైపు విష‌యం తెలుసుకున్న చిన్నారుల త‌ల్లిదండ్రులు కూడా తొర్రూర్‌ పోలీస్ స్టేషన్‌ లో ఫిర్యాదు చేయ‌గా.. కేసు నమోదు అయ్యింది. అలాగే ఈ ఘ‌ట‌న‌పై కలెక్టర్, ఎస్పీ కూడా సీరియ‌స్ అవ్వ‌డంతో.. పోలీసులు వెంట‌నే నిధితుల‌ను అరెస్ట్ చేశారు.‌

Share post:

Latest