నేటి నుంచి రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్‌..ఎప్ప‌టి వ‌ర‌కంటే?

ప్రాణాంత‌క వైర‌స్ అయిన క‌రోనా రోజురోజుకు వేగంగా విస్త‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన క‌రోనా సెకెండ్ వేవ్‌లో విశ్వ‌రూపం చూపిస్తోంది. ఓవైపు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ జోరుగా కొన‌సాగుతున్నా.. ఈ మ‌హ‌మ్మారి వారు, వీరు అనే తేడా లేకుండా అంద‌రిపై పంజా విసురుతూనే ఉంది. ఈ క్ర‌మంలోనే కొన్ని కొన్ని రాష్ట్రాల్లో మ‌ళ్లీ లాక్‌డౌన్ విధిస్తున్నారు.

తాజాగా మహారాష్ట్రలో కూడా సంపూర్ణ లాక్‌డౌన్ విధించారు. కరోనా మహమ్మారి తీవ్ర రూపం దాల్చుతోన్న నేపథ్యంలో మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్‌ 22 రాత్రి నుంచి మే 1వ తేదీ వరకు లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ప్ర‌క‌టించారు.

కాగా, గత వారమే లాక్‌డౌన్‌ విషయమై అన్ని పార్టీల నాయకులతో సమావేశమై చర్చించారు. అప్పుడు రాత్రిపూట కర్ఫ్యూ, వారాంతపు లాక్‌డౌన్‌ విధించాలని నిర్ణయం తీసుకున్నారు. అయిన‌ప్ప‌టికీ కరోనా అదుపులోకి రాకపోవడంతో చివరకు స‌ర్కార్‌ సంపూర్ణ లాక్‌డౌన్‌ను విధించింది.

Share post:

Latest