అక్కడ కరోనా టీకా వేయించుకుంటే ముక్కుపుల్ల ఫ్రీ.!?

దేశంలో మరలా క‌రోనా కేసులు బాగా పెరుగుతున్నాయి. ఒక్క రోజులోనే ఏకంగా ల‌క్ష‌కు పైగా కొత్త కేసులు నమోదు అయ్యాయి. క‌రోనా మ‌హ‌మ్మారి వచ్చినప్పటి నుండి ఒక్క రోజు లోనే ల‌క్ష‌కు పైగా కొత్త కేసులు న‌మోద‌వ‌డం ఇదే మొదటి సారి. కేసులు పెరుగుతుండ‌టంతో కేంద్ర, రాష్ట్ర‌ ప్రభుత్వాలు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను బాగా వేగ‌వంతం చేశాయి. అయితే ప్ర‌జ‌ల్లో చాలామందికి కరోనా వాక్సిన్ పై అపోహ‌ల‌ ఉన్న కారణంతో వ్యాక్సినేష‌న్‌కు ముందుకు రావ‌డంలేదు.

ఈ క్రమంలో ప్రజల్లో చైత్యనం పెంచుతూ వ్యాక్సిన్ వేయించుకునేందుకు ప్రోత్స‌హించేలా గుజరాత్‌లోని రాజ్‌కోట్ న‌గ‌రంలో ఓ బంగారం వ్యాపారుల సంఘం ఒక కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. త‌మ ప్రాంతంలోని వ్యాక్సినేష‌న్ కేంద్రంలో వాక్సిన్ వేయించుకున్న వారికి ఒక గోల్డెన్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. వ్యాక్సిన్ వేయించుకునే మహిళలకు ఫ్రీ గా ముక్కుపుల్ల‌ ఇస్తామని, అదే మగవాళ్ళు వ్యాక్సిన్ వేయించుకుంటే హ్యాండ్ బ్లెండర్ ఉచితంగా ఇస్తామని తెలిపారు.

Share post:

Latest