వైర‌ల్ వీడియో: అందాల రాక్ష‌సికి ఈ టాలెంట్ కూడా ఉందా?

లావణ్య త్రిపాఠి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `అందాల రాక్షసి` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ భామ‌.. మొద‌టి సినిమాతోనే యూత్‌ను తెగ ఆక‌ట్టుకుంది. ఈ చిత్రం త‌ర్వాత వ‌రుస బెట్టి సినిమాలు చేసిన లావ‌ణ్య‌.. తెలుగుతో పాటు త‌మిళ‌, హిందీ చిత్రాల్లోనూ న‌టించింది.

ఈ మ‌ధ్య ఏ1 ఎక్స్ ప్రెస్, చావు కబురు చల్లగా సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌కరించింది ఈ బ్యాటీ. అయితే ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డ్డాయి. ప్ర‌స్తుతం లావ‌ణ్య తెలుగులో ఏ సినిమా చేయ‌క‌పోయినా.. త‌మిళంలో ఓ ప్రాజెక్ట్ చేస్తోంది. ఇదిలా ఉంటే..సోష‌ల్ మీడియాలో యాక్టివ్ ఉంటే లావ‌ణ్య ‘వరల్డ్ డాన్స్ డే’ సందర్బంగా ఓ డాన్స్ వీడియో తాజాగా షేర్ చేసింది.

ఈ వీడియోలో లావ‌ణ్య డ్యాన్స్ అద‌ర‌గొట్టేస్తోంది. ఒక ప్రొఫిష‌న‌ల్‌ డ్యాన్స‌ర్‌గా స్టెప్పులు వేసింది. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైర‌ల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజ‌న్లు లావ‌ణ్య‌కు ఈ టాలెంట్ కూడా ఉందా అంటూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

https://twitter.com/baraju_SuperHit/status/1387783515832340480?s=20