ప్రముఖ హీరోయిన్లతో రైటర్ గారి వ్యవహారాలు !

ప్రముఖ రచయిత అయిన కోన వెంకట్ అడగకపోయినా హీరోయిన్లకు తన సపోర్ట్ అందిస్తుంటారు. గతంలో హీరోయిన్ అంజలి విషయంలోను అదే చేసారు. ప్రస్తుతం టాలీవుడ్ లో మరో హీరోయిన్ విషయంలో కూడా కోనగారు చూపిస్తన్న ఇంట్రస్ట్ పై ఇప్పుడు సినీ వర్గాల్లో బాగా వినిపిస్తున్న వార్త. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అంటే, నివేదా థామస్. ఈ బ్యూటీ కి మంచి ప్రతిభ ఉంది. పైగా తాను ఎక్స్ ప్రెషన్స్ తోనే అందరిని కట్టి పడేస్తోంది. నివేదాకు మొదటినుండి సపోర్ట్ ఇస్తూ వస్తున్నాడు కొన.

నివేదా కెరీర్ ను మలుపు తిప్పిన చిత్రం నిన్ను కోరి. మొదట ఆ సినిమాలో హీరోయిన్ వేరు. హీరో, డైరెక్టర్ కలిసి వేరే హీరోయిన్ను ఫైనల్ చేశారు కానీ మధ్యలో కోన ఎదో చేసి మొత్తానికి నివేదాకి ఆ అవకాశం ఇప్పించాడట. ఇప్పుడు తాజాగా విడుదలకి సిద్ధం అయిన వకీల్ సాబ్ కూడా కోనగారి పలుకుబడితోనే నివేదాకు వచ్చిందట. తనకు ఇంత సపోర్ట్ చేస్తోన్న కోనకి తానూ ఏమి ఇచ్చినా చాలా తక్కువే అని, ఆయన లాంటి వ్యక్తి ఇండస్ట్రీలో ఉంటె తనలాంటి హీరోయిన్ల లైఫే మారుతుందని అంటూ రీసెంట్ గా ఓ పార్టీలో తెగ ఎమోషనల్ అయిపోయిందట నివేదా.

Share post:

Latest