చివరికి పతనం తప్పదు అంటూ కంగనా ట్వీట్..!!

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మరోకసారి తన వ్యాఖ్యలతో వార్తల్లోకి ఎక్కారు. హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ముంబై మాజీ పోలీసు చీఫ్ పరం బీర్ సింగ్ హోంమంత్రి దేశ్‌ముఖ్ పై చేసిన ఆరోపణలపై సీబీఐ దర్యాప్తునకు బాంబే హై కోర్టు సోమవారం నాడు ఆదేశించింది. దీనితో హోమ్ మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ మంత్రి పదవికి రాజీనామా చేశారు.

దీనికి ట్విట్టర్ ద్వారా స్పందించిన బాలీవుడ్ నటి కంగనా అనిల్ దేశ్ ముఖ్ ను ఉద్దేశిస్తూ ఒక ట్వీట్ చేశారు. స్త్రీలను వేధించి, హింసించేవారికి, సాధువులను హత్య చేసే వారికి ఎప్పటికైనా పతనం తప్పదు. ముందు ముందు ఇంకేం జరగనుందో, ఇది కేవలం ఆరంభం మాత్రమే అంటూ కంగనా ట్వీట్ చేశారు. దీనితో కంగనా తాజాగా మరోకసారి వార్తల్లోకి ఎక్కి సంచలనం సృష్టించింది.

Share post:

Latest