నొప్పి మ‌న‌కే.. దాంతో బేరాలు వ‌ద్దంటున్న కాజ‌ల్!‌

కాజ‌ల్ అగ‌ర్వాల్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఇటీవ‌లె ప్రియుడు గౌత‌మ్ కిచ్లూను పెళ్లాడి వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన కాజ‌ల్.. వివాహం త‌ర్వాత కూడా వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే.. రోజురోజుకు వేగంగా విస్త‌రిస్తున్న క‌రోనాపై కాజ‌ల్ తాజాగా ఓ ఆస‌క్తిక‌ర పోస్ట్ పెట్టింది.

అందులో `మీరు ఎప్పుడైనా త్యాగం చేశారా? కూతురిని వేరే ఇంటికి పంపించడం.. కొన్ని మైళ్ల దూరంలో ఉన్న కాలేజీ మన సోదరులను పంపడం.. పెంపు జంతువుకు దీర్ఘకాలిక వ్యాధి ఉండటం.. వయస్సు మళ్లీన గ్రాండ్స్ పేరెంట్స్‌కి దూరం అవడం..ఒక స్నేహితుడి మిమ్మల్ని అపార్థం చేసుకోవడం.. మీరు ప్రేమించే వ్యక్తి మౌనం వహించడం.. ప్రేమానుబంధాలకు మిమ్మల్ని మీరే దూరం చేసుకోవడం.. ఇలాంటివి జరిగితే మీకు నష్టం అంటే ఏంటో తెలుస్తుంది.

అది మీకు ఊహించినట్లు మీ ముందుకు రాదు.. రూపం మార్చుకుంటుంది. కాబట్టి విషాదంతో బేరాలు వద్దు. నొప్పి మనకే.. గ్రహాంతరవాసికి కాదు` అని చెప్పుకొచ్చిన కాజ‌ల్‌.. ప్రస్తుతం కరోనా వైరస్ సెకండ్ వేవ్ ప్రపంచాన్ని భయానకంగా చేసింది. ఎవరు ఊహించని రీతిలో ప్రజలు ప్రాణాలు విడుస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచం ప్రమాదకరంగా మారింది. మనందరం మన కోసం శ్రమించే ఈ ఆరోగ్య వ్యవస్థకు భారం కాకుండా ఉంద‌మ‌ని తెలిపింది. ఇక కాజ‌ల్ క‌రోనాపై చేసిన వ్యాఖ్య‌లు ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారాయి.

https://www.instagram.com/p/CN1s8cundoU/?utm_source=ig_web_copy_link