వాలంటీర్లకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం జగన్..!?

ఏపీలో దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి సమయంలో వాలంటీరు అందించిన సేవలు అభినందనీయం. ఈ క్రమంలో ఉత్తమ పనితీరు కనబర్చిన వాలంటీర్లను ఉగాది రోజున సత్కరించాలని సీఎం జగన్ నిర్ణయించారు. తాజాగా ఈ కార్యక్రమానికి అవసరమైన మొత్తని ఏపీ సర్కార్ రిలీజ్ చేసింది. మొత్తం రూ.261 కోట్లు విడుదల చేస్తూ ఆర్ధికశాఖ ప్రత్యేక కార్యదర్శి సత్యనారాయణ ఉత్తర్వులు ఇచ్చారు. సేవా వజ్ర, సేవా రత్న, సేవామిత్ర పేరిట మొత్తం మూడు కేటగిరీల్లో వాలంటీర్లను సత్కరించనున్నారు. ఉగాది రోజున సీఎం చేతుల మీదుగా ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగామొదలు అవుతుంది. సేవా వజ్రకు రూ.30 వేలు, సేవారత్నకు రూ.20 వేలు, సేవా మిత్రకు రూ.10 వేల నగదు పురస్కారం ఇవ్వనున్నారు.

ఫస్ట్ కేటగిరీలో 2,18,115 మంది వాలంటీర్లకు సేవా మిత్ర అవార్డు ఇస్తారు. సెకండ్ కేటగిరీలో 4,000 మంది వాలంటీర్లకు సేవా రత్న అవార్డు ఇవ్వనున్నారు. మూడో కేటగిరీలో, వృత్తిలో పూర్తి నిబద్ధత చూపించిన వాలంటీర్లని అసెంబ్లీ నియోజకవర్గానికి ఐదుగురు చొప్పున 875 మంది వాలంటీర్లను సేవా వజ్ర అవార్డుకు ఎంపిక చేస్తారు. వీరిని రూ.30 వేల నగదు, సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జి, ఇంకా మెడల్‌తో సత్కరించనున్నారు.

Share post:

Popular