వకీల్ సాబ్ మూవీ రన్ టైం ఎంతో తెలుసా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన లేటెస్ట్ చిత్రం వకీల్ సాబ్, ఒక్కసారిగా భారీ హైప్ క్రీస్తే చేస్తున్న పవర్ స్టార్ పవన్ కం బ్యాక్ చిత్రం ఇప్పుడు ప్రమోషన్స్ ను ఒక రేంజ్ లో జరుపుకుంటుంది. ప్రస్తుతం ఈ చిత్రం గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. గత కొన్ని రోజులు నుంచి ఈ మూవీ తాలుకా సెన్సార్ పూర్తయ్యిందని యూ/ఏ సర్టిఫికెట్ వకీల్ సాబ్ చిత్రం దక్కించుకుంది అని సమాచారం.

ఇదిలా ఉండగా ఈ మూవీకి సంబంధించి మొత్తం రన్ టైం ఎంతో తెలిసింది. ఈ చిత్రాన్ని ఒరిజినల్ వెర్షన్ కంటే ఎక్కువ సన్నివేశాలు యాడ్ చెయ్యడంతో 154 నిమిషాల నిడివి వచ్చిందట. అసలు దర్శకుడు శ్రీరామ్ ఈ మూవీని ఎలా చేసారో తెలియాలంటే వచ్చే నెల 9వ తారీఖు వరకు ఎదురు చూడక తప్పదు.

Share post:

Popular