ఐపీఎల్ 2021: పాయింట్ల ప‌ట్టిక‌లో టాప్-4 జట్లు ఇవే..లీస్ట్ ఎవ‌రంటే?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 14వ సీజన్ జోరు జోరుగా కొన‌సాగుతోంది. టైటిల్ త‌మ సొంతం చేసుకునేందుకు ప్ర‌తి జట్టు పోటా పోటీగా త‌ల‌ప‌డుతున్నారు. నిన్న రాత్రి ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ త‌ల ప‌డిన సంగ‌తి తెలిసిందే.

ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధించిన రాజస్థాన్ రాయల్స్‌కు పాయింట్ల ప‌ట్టిక‌లో ఊరిట ల‌భించింది. ఈ విజ‌యంతో ఆఖరి స్థానం నుంచి ఆరో స్థానానికి ఎగబాకింది. దాంతో ఆరో స్థానంలో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ ఏడుకి పడిపోగా.. కోల్‌కతా లీస్ట్‌లో నిలిచింది.

ఇక పాయింట్ల ప‌ట్టిక‌లో టాప్-4 జట్లు వివ‌రాలు చూస్తే..రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (8 పాయింట్లు), చెన్నై సూపర్ కింగ్స్ (6 పాయింట్లు), ఢిల్లీ క్యాపిటల్స్ (6 పాయింట్లు), ముంబయి ఇండియన్స్ (4 పాయింట్లు) టాప్-4లో కొన‌సాగుతున్నాయి. ఆ త‌ర్వాత పంజాబ్ కింగ్స్ (4 పాయింట్లు), రాజస్థాన్ రాయల్స్ (4 పాయింట్లు), సన్‌రైజర్స్ హైదరాబాద్ (2 పాయింట్లు), కోల్‌కతా నైట్‌రైడర్స్ (2 పాయింట్లు) ఉన్నాయి.

Share post:

Latest