మొక్క‌ల పెంప‌కంపై ప్రత్యేక డూడుల్ ను రూపొందిన గూగుల్..!

 

 

గూగుల్ మన ధ‌రిత్రి దినోత్స‌వం సంద‌ర్భంగా సృజనాత్మక డూడుల్‌తో కలిసి మనల్ని ఆలోచించేలా చేస్తుంది. మాన‌వ మ‌నుగ‌డ‌కు చెట్లను నాటడం ఎంతో ప్రాధాన్యం అంటూ హైలైట్ చేసింది. గురువారం ప్రపంచ వ్యాప్తంగా ధ‌రిత్రి దినోత్స‌వాన్ని జరుపుకుంటున్నారు. ఒక వృద్ధురాలు చెట్టు కింద ఒక పుస్తకం చదువుతూ ఉండగా, ఆమె మనుమరాలు ఒక మొక్క‌ను నాటింది. అలా అలా వారి తరువాత త‌రాల‌తో మొక్క‌ల‌ను నాటిస్తూ వారు ఉండే చోటు ప‌చ్చ‌గా ఉండేలా మార్చుకున్నారు. మ‌నమూ అలాగే చేద్దాం. ప‌చ్చ‌గా ఉందాం అనే నినాదంతో గూగుల్ డూడుల్ చాలా బాగుంది.

ఈ వీడియోలో, వివిధ రకాల చెట్లను నాటి, భవిష్యత్ తరాల కోసం మన భూమిని ఆరోగ్యంగా ఉంచడానికి మన వంతు కృషి చేద్దాం అంటూ చెప్తుంది. మేము ఇల్లు అని పిలిచే భూగ్ర‌హం మ‌న జీవితాల‌ను ఎలా పెంపొందిస్తూ అద్భుతాన్ని ప్రేరేపిస్తుంది. మన వాతావరణం మనల్ని నిలబెట్టడానికి చాలా కష్టపడుతోంది. ఇది మనకు అనుకూలంగా తిరిగి రావాలని పిలుస్తుంది అంటూ ఎర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ప్రకటనలో గూగుల్ తెలిపింది.

 

<iframe width=”560″ height=”315″ src=”https://www.youtube.com/embed/hAxqygRdM4g” title=”YouTube video player” frameborder=”0″ allow=”accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture” allowfullscreen></iframe>