‘బోర్డర్’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్..!

సీనియర్ నటుడు విజయ్ కుమార్ కొడుకు అయిన అరుణ్ విజయ్ తమిళంలో ఎన్నో సినిమాలు చేసాడు. అందులో కొన్ని చిత్రాలు తెలుగులో కూడా డబ్ అయ్యాయి. అయితే రామ్ చరణ్ నటించిన బ్రూస్లీ, ప్రభాస్ సాహో చిత్రాలలో నటించి, టాలీవుడ్ ఆడియెన్స్ కూ దగ్గరయ్యాడు అరుణ్ విజయ్. ప్రస్తుతం అరుణ్ తో దర్శకుడు అరివళగన్ ఓ చిత్రం తెరకెక్కిస్తున్నాడు.

తమిళంతో పాటు ఇతర భాషల్లో కూడా రిలీజ్ కాబోతున్న ఈ స్పై థ్రిల్లర్ చిత్రానికి బోర్డర్ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. గురువారం నాడు ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. సామ్ సి.ఎస్. సంగీతం అందిస్తున్న బోర్డర్ చిత్రంలో రెజీనా కసండ్రా, స్టెఫీ పటేల్ ముఖ్య పాత్రలు చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ పొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని మేలో రిలీజ్ చేస్తామని నిర్మాత విజయ్ రాఘవేంద్ర చెప్పారు.

Share post:

Latest