హీరోగా ఎంట్రీ ఇవ్వ‌బోతున్న స్టార్ డైరెక్ట‌ర్ త‌న‌యుడు?

ఇప్ప‌టికే సినీ ఇండ‌స్ట్రీలోకి ఎంద‌రో వార‌సులు ఎంట్రీ ఇచ్చారు. వారిలో కొంద‌రు సూప‌ర్ స‌క్సెస్ అయ్యి.. స్టార్ హీరోలుగా ఎద‌గ‌గా, కొంద‌రు అడ్ర‌స్ లేకుండా పోయిన వారూ ఉన్నారు. అయితే ఇప్పుడు మ‌రో వార‌సుడు తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్ట‌నున్నాడ‌ట‌. టాలీవుడ్‌లో తనకంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న స్టార్ డైరెక్ట‌ర్‌ తేజ.. త‌న కుమారుడిని ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేసేందుకు రెడీ అవుతున్న‌ట్టు తెలుస్తోంది.

- Advertisement -

తేజ ప్రస్తుతం గోపీచంద్ హీరోగా `అలమేలుమంగ- వెంకటరమణ` సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు. ఆ సినిమా సెట్స్ పై ఉండగానే ఆయన తన తదుపరి సినిమాను `చిత్రం 1.1`ను ప్రకటించాడు. `చిత్రం` సినిమాకి సీక్వెల్ ఇది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ బావమరిది నితిన్ చంద్ర హీరోగా న‌టిస్తున్నాడ‌ని ఆ మ‌ధ్య వార్త‌లు వ‌చ్చాయి.

కానీ, తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ చిత్రంలో డైరెక్ట‌ర్ తేజ త‌న‌యుడు అమితవ్‌ తేజ హీరోగా న‌టించ‌నున్నాడ‌ట‌. ఇందులో భాగంగానే అమితవ్ ప్ర‌స్తుతం విదేశాల్లో యాక్టింగ్‌లో ట్రైనింగ్‌ కూడా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.. ఇక ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ఈ నెల 18నుంచి ప్రారంభం కానుంది. ఆ రోజే హీరోను పరిచయం చేస్తారని సమాచారం.

Share post:

Popular