పెళ్లికి ముందే గ‌ర్భ‌వ‌తిని..`వైల్డ్ డాగ్` హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

బాలీవుడ్ బ్యూటీ దియా మీర్జా త్వ‌ర‌లోనే పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవలె దియా సోష‌ల్ మీడియా వేదిక‌గా.. తన ప్రెగ్నెన్సీ విష‌యాన్ని అభిమానుల‌తో పంచుకుంది. బేబీ బంప్‌తో ఉన్న ఫొటోను కూడా షేర్ చేసింది. ఈ క్ర‌మంలోనే సినీ తార‌లు, అభిమానులు ఆమెకు బెస్ట్ విషెస్ తెలిపారు.

అయితే దియా బిజినెస్ మాన్ వైభవ్ రేఖీని ఫిబ్రవరి 15న వివాహం చేసుకున్నారు. అంటే దియా వివాహం జరిగి రెండు నెలలు కూడా పూర్తి కాలేదు. దీంతో ఓ నెటిజ‌న్ మీరు పెళ్లికి ముందే గర్భవతి అయ్యారా? అని ఆమెకు సూటి ప్ర‌శ్న వేయ‌గా.. దియా షాకింగ్ కామెంట్స్ చేసింది. `పెళ్లి ప్లానింగ్‌లో ఉండగా నేను గర్భవతి అని తెలిసింది. మా ఇద్దరికీ బిడ్డ పుట్టబోతుంది కాబట్టి… ఈ ప్రెగ్నెన్సీ వల్ల హడావిడిగా పెళ్లి చేసుకోలేదు.

ఈ విషయం ముందు చెప్పడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ అప్పటికే నాకు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. అందుకే అంతా సవ్యంగా సాగుతుందా లేదా అన్న విషయంపై స్పష్టత లేక ఎవ‌రికీ చెప్ప‌లేదు. ఇక బిడ్డను కనాలనుకునే మహిళ పెళ్లికి ముందా తర్వాత అనేది ఆమె వ్యక్తిగత విషయం.. ఇందులో సమాజం ఏమనుకుంటుందో అనే భయం అవ‌స‌రం లేదు` అని దియా కుండ బద్దలు కొట్టింది. కాగా, దియా నాగ్ స‌ర‌స‌న `వైల్డ్ డాగ్‌`లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం ఏప్రిల్ 2న విడుద‌లై మంచి టాక్ తెచ్చుకుంది.‌

Share post:

Latest