కుమార్తె ప్రియుడి కోరిక తీర్చిన త‌ల్లి..! క‌ట్ చేస్తే..

ముందూ వెన‌కా ఆలోచించ‌కుండా ప్రేమించ‌డం.. అటుత‌రువాత స‌మ‌స్య‌ల్లో కూరుకుపోవ‌డం ఈత‌రం యువ‌త‌రానికి ప‌రిపాటిగా మారింది. అంతేకాదు వారు వేసిన త‌ప్ప‌ట‌డుగు త‌ల్లిదండ్రుల‌ను ఇబ్బందుల‌ను గురిచేయ‌డంతో పాటు మాన‌సిక వేద‌నను మిగుల్చుతుంది. అందుకు ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తుంది ఈ సంఘ‌ట‌న‌. మహారాష్ట్రకు చెందిన‌ 24 ఏళ్ళ యువకుడు తన కాలేజీ లో చదివే యువతి రెండేళ్ల నుండి ప్రేమించుకుంటున్నారు. వారి ప్రేమ విషయం యువతి తల్లిదండ్రులకు తెలిసింది. వారిరువురి కులాలు వేరు కావ‌డంతో పెళ్లికి ఒప్పుకోలేదు. అంతేకాకుండా అమ్మాయికి వేరే సంబంధం చూశారు. దీంతో కొద్దికాలం మౌనంగా ఉన్న ప్రియుడు, ఒక్క‌సారిగా ప్రియురాలి పెళ్లికి మరికొన్ని రోజులు ఉందనగా సీన్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. రూ.ల‌క్షా 50 వేలు ఇవ్వాల‌ని, లేక‌పోతే త‌న‌తో ఏకాంతంగా గ‌డిపిన వీడియోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్టుచేస్తాన‌ని యువతిని బెదిరించ‌డం మొద‌లు పెట్టాడు.

ఇదిలా ఉండ‌గా ప్రియుడి వేధింపుల‌తో విసిగిపోయిన యువ‌తి విష‌యాన్ని త‌ల్లితో చెప్పుకుని బోరుమంది. దీంతో విష‌యం బ‌య‌ట‌కు తెలిస్తే అమ్మాయి పెళ్లి ఆగిపోవ‌డంతో పాటు, త‌మ ఇంటి పరువు పోతుంద‌ని గ్రహించిన యువతి తల్లి ఆ యువ‌కుడు అడిగిన న‌గ‌దు మొత్తాన్ని చెల్లించింది. అయిన‌ప్ప‌టికీ శాంతించ‌ని ప్రియుడు వ‌క్ర‌బుద్ధిగానే ఆలోచించ‌డం మొద‌లుపెట్టాడు. అత‌గాడు త‌న వ‌క్ర‌బుద్ధిని మార్చుకోలేదు. ప్రియురాలు పెళ్లిచేసుకోబోయే వ్య‌క్తికి త‌న వ‌ద్ద ఉన్న‌ వీడియోల‌ను పంపించాడు. వాటిని చూసిన ఆ పెళ్ళికొడుకు తనకు ఆ యువ‌తితో పెళ్లి వద్దని రద్దు చేశాడు. దీంతో ఆగ్రహించిన యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు మాజీ ప్రియుడును అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు.

Share post:

Latest