ప్రియుడితో భార్య రాస‌లీలు.. రెడ్‌హ్యాండెడ్‌గా ప‌ట్టుకుని..

అక్ర‌మ‌సంబంధాలు అనేక అన‌ర్థాల‌కు దారితీస్తున్నాయి. ప‌చ్చ‌ని కుటుంబాల్లో చిచ్చు రేపుతున్నాయి. హ‌త్య‌లు, ఆత్మ‌హ‌త్య‌లకూ దారి తీస్తున్నాయి. అయిన‌ప్ప‌టికీ కొంద‌రు త‌మ ప‌ద్ధ‌తుల‌ను మార్చుకోవ‌డం లేదు. శారీర‌వాంఛ‌ల కోసం క‌ట్టుకున్నవారినే మోస‌గిస్తున్నారు. అందుకు ఈ సంఘ‌ట‌న ఒక ఉదాహ‌ర‌ణ‌. ప్రియుడితో రాస‌లీలలు కొన‌సాగిస్తున్న భార్య‌ను రెడ్‌హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్నాడు ఓ భ‌ర్త‌. ఆ త‌రువాత ఇద్ద‌రూ అవ‌మానం భ‌రించ‌లేక ఎలుక‌ల మందుతాగి ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. అధికారులు, బాధితులు తెలిపిన క‌థ‌నం ప్ర‌కారం.. ‌

బీహార్ లోని బేగూసరాయ్కి చెందిన కుసుమ (పేరు మార్చాం) కి 2014లో అదే గ్రామానికి చెందిన తన క్లాస్ మేట్ షేక్‌ నాగూర్‌ ని ప్రేమించింది. ఇంట్లో పెద్ద‌లు ఒప్పుకోక‌పోవ‌డంతో అయిష్టంగానే వేరొక‌‌ వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అయిన‌ప్ప‌టికీ కుసుమ త‌న ప్రియుడితో అక్ర‌మ సంబంధాన్ని కొన‌సాగిస్తున్న‌ది. పాట్నాలో వ్యాపారం చేసే ప్రియుడు నాగూర్‌ మధ్యమధ్యలో కుసుమ కోసం బేగూసరాయ్ వ‌చ్చేవాడు. ప్రియుడిని క‌లుసుకునేందుకు ఆమె తల్లిగారింటికి వెళ్లేది. ఎప్ప‌టిలాగే నాగూర్ బేగూసరాయ్ వెళ్ల‌గా కుసుమ కూడా వెళ్లింది. వారిద్దరూ కుసుమకు తెలిసిన స్నేహితుడి గదిలో క‌లుసుకున్నారు. రాస‌లీల‌ల్లో మునిగిపోయారు. అప్ప‌టికే వారి మీద నిఘా ఉంచిన భర్త గ్రామస్థులతో కలిసి ఆ ఇంటికి చేరుకున్నాడు. రాస‌లీల‌ల్లో మునిగిపోయిన ఆ ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. గ్రామస్థులతో కలిసి చితబాది గదిలో బంధించారు. ఈ అవ‌మానం భ‌రించ‌లేక వాళ్లిద్దరూ అక్కడే గదిలో ఉన్న ఎలుకల మందు మింగారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన వారిద్ద‌రిని వైద్య‌శాల‌కు త‌ర‌లించ‌గా అప్ప‌టికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధరించారు. స్థానికుల ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భయంతో వారే ఎలుకల మందు తిన్నారా.. లేదా వేరే ఏమైనా జరిగిందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Share post:

Latest