మరోకసారి ముంచుకోస్తున్న కరోనా ముప్పు ..!?

ప్రపంచ వ్యాప్తంగా మళ్ళి కరోనా వ్యాప్తి చెందుతుంది. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతున్నా కూడా కేసుల సంఖ్య మాత్రం తగ్గటం లేదు. యాక్టివ్‌ కేసుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తున్నాయి. అమెరికాలో ఇప్పుడు 69.23 లక్షల యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇక ఫ్రాన్స్‌లో అత్యధికంగా 43.2 లక్షల మంది కరోనా బారినపడి చికిత్స తీసుకుంటున్నారు. బ్రెజిల్‌లో 12.78 లక్షలు, బెల్జియంలో 8.07 లక్షల యాక్టివ్ కేసులు , ఇటలీలో యాక్టివ్‌ కేసులు 5.63 లక్షలు వేలకు చేరుకుంది.

ఇక పోతే భారత్‌లో 6.14 లక్షలకు కేసులు పెరిగిపోయాయి. ఇంకా బ్రిటన్‌లో 3.63 లక్షలు, పోలాండ్‌లో 4.22 లక్షలు ఉన్నాయి. ఉక్రెయిన్‌లో 3.44 లక్షలు, రష్యాలో 2.77 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇలా మరోకసారి కరోనా ముప్పు మరలా ముంచుకొస్తుంది. అమెరికాతో పాటు యూరప్‌లోనూ కరోనా బాగా విజృంభిస్తుంది.ఇంకా భారత్‌లో మహారాష్ట్రలో మూడు లక్షలకు పైగా కేసులు ఉన్నాయి. అలాగే తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలోనూ చాలా జోరుగా విజృంభిస్తోంది ఈ కరోనా వైరస్.