తెలంగాణ‌లో 3,34,738కి చేరిన క‌రోనా కేసులు..తాజా లెక్క ఇదే!

ఎక్క‌డో చైనాలో పుట్టిన క‌రోనా వైర‌స్‌.. ప్ర‌పంచ‌దేశాల‌ను కుదిపేస్తున్న సంగ‌తి తెలిసిందే. కంటికి క‌నిపించ‌కుండా క‌ల్లోలం సృష్టిస్తున్న ఈ ప్రాణాంత‌క వైర‌స్‌.. ప్ర‌స్తుతం మ‌ళ్లీ శ‌ర వేగంగా విజృభిస్తోంది. దీంతో అన్ని దేశాల్లో, రాష్ట్రాల్లో క‌రోనా పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు భారీగా న‌మోదు అవుతున్నాయి.

తెలంగాణ‌లోనూ నిన్న రెండు వేల‌కు పైగా క‌రోనా కేసులు న‌మోదు అయ్యాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,157 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసులు 3,34,738 కి చేరింది. నిన్న క‌రోనాతో 8 మంది మృత్యువాత ప‌డ్డారు.

దీంతో ప్ర‌స్తుతం రాష్ట్రంలో మృతుల సంఖ్య 1,780 ద‌గ్గ‌ర నిలిచింది. అలాగే నిన్న క‌రోనా నుంచి 821 మంది కోలుకుని డిశ్చార్జ్ అవ్వ‌గా.. ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 3,07,499 కు చేరుకుంది. ఇక ప్ర‌స్తుతం రాష్ట్రంలో 25,459 మంది చికిత్స పొందుతున్నారు. వారిలో 16,892 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు.

Share post:

Latest