ఏపీలో క‌రోనా ఉధృతి..3 వేలకు పైగా కొత్త కేసులు!

ప్ర‌పంచ‌దేశాల‌కు క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రినీ ముప్ప తిప్ప‌లు పెడుతోంది. ఇప్ప‌టికే ఈ ప్రాణాంత‌క వైర‌స్ కార‌ణంగా కొన్ని ల‌క్ష‌ల మంది ప్రాణాలు విడ‌వ‌గా.. ప్ర‌స్తుతం ఈ మ‌హ‌మ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేష‌న్ ప్రారంభించారు అధికారులు.

ఇదిలా ఉంటే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసులు నిన్న మూడు వేల‌కు పైగా న‌మోదు అయ్యాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,263 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసులు 9,28,664 కి చేరింది. చిత్తూరు జిల్లాలో అత్య‌ధికంగా 654 కేసులు న‌మోదు అయ్యాయి. అయితే గత 24 గంటల్లో 11 మంది మృత్యువాత ప‌డ్డారు.

ప్ర‌స్తుతం రాష్ట్రంలో మృతుల సంఖ్య 7,311 ద‌గ్గ‌ర నిలిచింది. అలాగే కొత్తగా రికవరీ అయిన వారి సంఖ్య 1,091నమోదు కాగా.. ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 8,98,238 కి చేరుకుంది. ప్ర‌స్తుతం ఏపీలో 23,115 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక నిన్న ఒక్క రోజే 33,755 క‌రోనా టెస్ట్‌లు నిర్వ‌హించారు అధికారులు.

Share post:

Popular