కరోనా భారిన పడిన మల్లీశ్వరి హీరోయిన్..!?

దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఇక బాలీవుడ్‌లో కరోనా కేసులు ఆగడం లేదు. ఒకరి తర్వాత ఒకరికి కరోనా వస్తూనే ఉంది. ఇప్పటికే సగం ఇండస్ట్రీకి కరోనా సోకింది. అక్షయ్ కుమార్, అమీర్ ఖాన్ లాంటి స్టార్ హీరోలకు కూడా కరోనా వచ్చింది. హీరోయిన్లు కూడా చాలా మంది కోవిడ్ బారిన పడ్డారు. ఇప్పుడు కత్రినా కైఫ్ కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. తనకు కరోనా వచ్చింంటూ స్వయంగా పోస్ట్ చేసింది కత్రినా. అభిమానులతో ఈ విషయం చెప్పింది.

సోషల్ మీడియాలో తనకు కరోనా పాజిటివ్ వచ్చిన విషయాన్ని అధికారికంగా ధృవీకరించింది కత్రినా. నాకు కరోనా వచ్చింది.. వెంటనే హోమ్ క్వారంటైన్‌కు వెళ్లిపోయాను.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను ఇంట్లోనే ఉంటాను. ఎప్పటికప్పుడు వైద్యుల సూచనలు, సలహాలు కూడా తీసుకుంటాను. నన్ను ఈ మధ్య కలిసిన వాళ్లు కూడా వెంటనే వెళ్లి టెస్టు చేయించుకోండి.. ఇంట్లోనే ఉండండి.. బయటికి రావద్దు అంటూ లేఖ విడుదల చేసింది. ప్రస్తుతం అక్షయ్ కుమార్‌తో సూర్య వంశీ, సల్మాన్ ఖాన్ టైగర్ 3 సినిమాలతో బిజీగా ఉంది కత్రినా. ఈమె కరోనా బారిన పడటంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే తన ఆరోగ్యం బాగానే ఉందని.. కంగారు పడాల్సిన అవసరం లేదని కత్రినా వెల్లడించారు.

Share post:

Latest