కరోనా ఎఫెక్ట్…ఐసీఎస్ఈ పరీక్షలు రద్దు..!

కరోనా వైరస్ సెకండ్ వేవ్ చాలా వేగంగా విజృంభిస్తుండటంతో ప్రస్తుతం పరీక్షలన్నీ రద్దు అవుతున్నాయి. ఇప్పుడు తాజాగా కరోనా ఎఫెక్ట్‌తో మరో పరీక్ష కూడా రద్దు అయింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కౌన్సిల్ ఫర్ ఇండియన్ స్కూల్ సర్టిఫికేషన్ ఎగ్జామినేషన్ CISCE ఐసీఎస్ఈ కూడా పదో తరగతి పరీక్షల్ని రద్దు చేసింది. ప్రస్తుతం కరోనా విజృంభణ చాలా వేగంగా ఉండటంతో ఐసీఎస్ఈ 10వ తరగతి పరీక్షల్ని రద్దు చేస్తున్నామని CISCE చీఫ్ ఎగ్జిక్యూటీవ్ అండ్ సెక్రెటరీ గెర్రీ అరాథూన్ ఒక సర్క్యులర్ జారీ చేశారు.

కొద్ది రోజుల క్రితం సీబీఎస్ఈ కూడా పరీక్షల నిర్వహణ పై ఒక కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షలు కూడా రద్దు చేసింది. 12వ తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. ఐసీఎస్ఈ టెన్త్ పరీక్షల్ని రద్దు చేయడంతో పాటు 12వ తరగతి పరీక్షల్ని వాయిదా వేస్తూ కౌన్సిల్ ఫర్ ఇండియన్ స్కూల్ సర్టిఫికేషన్ ఎగ్జామినేషన్ CISCE నిర్ణయం తీసుకుంది. ఈ సంవత్సరం ఐసీఎస్ఈ 10వ తరగతి విద్యార్థులు రెండు లక్షలకు పైగా ఉన్నారు.