చిరు `లూసిఫర్` రీమేక్‌కు క్రేజీ టైటిల్‌..?

మెగా స్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో `ఆచార్య‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. షూటింగ్‌ను శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటున్న ఈ చిత్రం.. మే14న విడుద‌ల కానుంది. ఈ చిత్రం త‌ర్వాత చిరు `లూసిఫర్` రీమేక్ చేయ‌నున్నాడు. మలయాళంలో మోహన్‌లాల్ హీరోగా తెర‌కెక్కిన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది.

ఇప్పుడు ఇదే చిత్రాన్ని తెలుగులో ద‌ర్శ‌కుడు మోహన్‌రాజా తెర‌కెక్కించ‌బోతున్నారు. ఇటీవ‌లె ఈ సినిమా ప్రారంభం కాగా.. త్వ‌ర‌లోనే రెగ్యులర్ షూటింగ్‌కి రెడీ అవుతోంది. ఇదిలా ఉంటే.. ఈ రీమేక్ చిత్రానికి క్రేజీ టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసిన‌ట్టు జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇంతకీ ఏమిటి ఆ టైటిల్ అంటే ‘కింగ్ మేకర్’. లూసిఫర్‌కు ఈ టైటిల్ అయితేనే బాగా సెట్ అవుతుంద‌ని భావించిన యూనిట్‌.. రిజిస్ట‌ర్ కూడా చేయించుకున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నారు. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాలంటే.. అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సిందే.
‌‌