చిరు ఇంటికెళ్లిన నాగ్‌..అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన మెగాస్టార్‌!

కింగ్ నాగార్జున తాజా చిత్రం `వైల్డ్ డాగ్‌`. అహిషోర్ సాల్మోన్ ద‌ర్శక‌త్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచ‌నాల న‌డుము ఏప్రిల్ 2న(ఈ రోజు) విడుద‌ల కానుంది. దీంతో ఇప్ప‌టికే చిత్ర యూనిట్ జోరుగా ప్ర‌మోష‌న్స్ నిర్వ‌హించింది. అయితే ఎంత సీనియ‌ర్ హీరో అయిన‌ప్ప‌టికీ.. సినిమా విడుద‌ల‌కు ముందు టెన్ష‌న్ ప‌డ‌టం చాలా కామ‌న్‌.

- Advertisement -

నాగార్జున కూడా అదే టెన్ష‌న్‌లో ఉన్నార‌ట‌. అయితే ఆ టెన్ష‌న్ నుంచి రిలీఫ్ పొందేందుకు నాగార్జున త‌న మిత్రుడు, మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లాడు. ఇక అతిథిగా వచ్చిన నాగార్జునకు చిరు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు. స్వ‌యంగా త‌న చేతుల‌తోనే వంట చేసి.. నాగ్‌కు క‌మ్మ‌ని విందు ఏర్పాటు చేశాడు.

ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా నాగార్జున అభిమానుల‌తో పంచుకున్నాడు.రేపు వైల్డ్ డాగ్ రిలీజ్ కానుండడంతో కొంచెం ఒత్తిడిలో ఉన్నానని, అయితే ఆ ఒత్తిడిని తొలగించేందుకు మెగాస్టార్ స్వయంగా త‌న కోసం గరిటె పట్టుకుని వంట చేశారని, రుచికరమైన విందు భోజనం వడ్డించారని నాగ్ వివరించారు. దీనికి సంబంధించిన ఫొటోను కూడా నాగ్ పంచుకున్నారు. ప్ర‌స్తుతం ఈ ఫొటో వైర‌ల్‌గా మారింది.

Image

Share post:

Popular