విశ్వనాథన్ ఆనంద్ తండ్రి కన్నుమూత..!

ప్రపంచ చదరంగం క్రీడలో భారతదేశానికి వన్నెతెచ్చిన క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్. అతి చిన్న వయసులోనే చెస్ క్రీడలో నైపుణ్యం సంపాదించాడు. 14 వ ఏటనే సబ్ జూనియర్ జాతీయ చెస్ చాంపియన్ షిప్ సాధించాడు. 1985 లోనే ఇంటర్నేషనల్ మాస్టర్గా అవతరించాడు. ఐదుసార్లు వ‌ర‌ల్డ్ చెస్ చాంపియ‌న్‌గా నిలిచిన విశ్వ‌నాథ‌న్ ఆనంద్ తండ్రి కే విశ్వ‌నాథ‌న్ గురువారం నాడు మృతిచెందారు. ఆయ‌న గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు.

విశ్వ‌నాథ‌న్ వ‌య‌సు 92 ఏళ్లు. గ‌తంలో ఆయ‌న ద‌క్షిణ రైల్వే జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్‌గా విధులు నిర్వర్తించారు.విశ్వ‌నాథ‌న్‌కు ముగ్గురు సంతానం. ఆనంద్ చెస్‌లో ఈ స్థాయికి చేర‌డంలో విశ్వ‌నాథ‌న్ పాత్ర ఎంత‌గానో ఉన్న‌ట్లు అత‌ని భార్య అరుణ అన్నారు. ఆనంద్ సాధించిన అన్ని వ‌ర‌ల్డ్ చాంపియ‌న్‌షిప్ విజ‌యాల‌ను విశ్వ‌నాథ‌న్ చూశార‌ని, తన విజయాలను చూసి ఆయన చాలా గ‌ర్వించాడ‌ని అతని భార్య అరుణ చెప్పుకొచ్చారు.