రెడ్ డ్ర‌స్‌లో నిహారిక వ‌య్యారాలు..భ‌ర్త షాకింగ్ కామెంట్స్‌!

మెగా డాట‌ర్ నిహారిక గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఒక మనసు` సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక‌.. మ‌రికొన్ని చిత్రాల్లోనూ న‌టించింది. కానీ, హిట్ మాత్రం ప‌డ‌లేదు. అయితే న‌ట‌న ప‌రంగా మంచి మార్కులే నిహారిక‌.. గ‌త ఏడాది డిసెంబర్‌9న మిసెస్‌ నిహారికగా మారిన సంగతి తెలిసిందే.

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జొన్నలగడ్డ చైతన్యతో నిహారిక పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఇక వివాహం త‌ర్వాత కూడా కెరీర్‌ను కొన‌సాగించాల‌ని ప్ర‌య‌త్నిస్తోంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ.. త‌న‌కు సంబంధించిన ఫొటోల‌ను షేర్ చేస్తుంటుంది. ఇక తాజాగా నిహారిక ఫొటోషూట్ చేయ‌గా.. అందుకు సంబంధించిన ఫొటోల‌ను షేర్ చేసింది.

అంతేకాదు, ఈ ఫొటోల‌కు తెలుగులో క్యాప్షన్ ఇచ్చింది. రెడ్ డ్ర‌స్ ధ‌రించిన నిహారిక ఈ ఫొటోల్లో వ‌య్యారాలు వ‌ల‌క‌బోస్తూ మెరిసిపోతోంది. ప్ర‌స్తుతం ఈ ఫొటోలు అభిమానుల‌ను, నెటిజ‌న్లు తెగ ఆక‌ట్టుకుంటున్నాయి. అయితే ఈ ఫొటోల‌పై ఆమె భ‌ర్త చైత‌న్య గులాబీ కళ్లు రెండు ముళ్లు చేసి గుండెలోకి గుచ్చుతున్నావే’ అంటూ రామ్‌చరణ్‌ పాటతో శ్రీ‌మ‌తిపై పొగ‌డ్త‌లు వ‌ర్షం కుర‌పించాడు.

https://www.instagram.com/p/CNU8zzWpQis/?utm_source=ig_web_copy_link

Share post:

Latest