బ్రేకింగ్ : అల్లు అరవింద్ కు కోవిడ్ పాజిటివ్..!?

దేశంలో కరోనా వైరస్ సెకండ్ వే విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఇక ఒక్కవైపు దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ ని ప్రజలకు అదజేస్తూనే ఉన్న మరో వైపు కరోనా వ్యాప్తి చెందుతూనే ఉంది. తాజాగా మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కు కరోనా పాజిటి రిపోర్ట్ వచ్చినట్టు తెలుస్తుంది. ఈమధ్య ఆహాలో రిలీజ్ అవుతున్న వెబ్ సీరీస్ ల ప్రెస్ మీట్ లకు తరచు అటెండ్ అవుతున్న అల్లు అరవింద్ కోవిడ్ బారిన పడినట్టు తెలుస్తుంది.

అయితే అల్లు అరవింద్ ఆల్రెడీ కరోనా రాకుండా రెండు డోసుల వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది.రెండు డోస్ ల వ్యాక్సినేషన్ వేసుకున్నా సరే కరోనా పాజిటివ్ వచ్చిన సినీ సెలబ్రిటీస్ లో అల్లు అరవింద్ మొదటివారని చెప్పాలి. ఇక ఇదివరకు త్రివిక్రం శ్రీనివాస్ కు మొదటి డోస్ పడ్డాక కోవిడ్ పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది .అయితే వారం పదిరోజులకే మళ్లీ నెగటివ్ రిపోర్ట్ వచ్చింది. ఇక లేటెస్ట్ గా అల్లు అరవింద్ కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయినట్టు తెలుస్తుంది.వ్యాక్సిన్ వేసినా సరే కోవిడ్ బారిన పడటం షాకింగ్ గా ఉంది.

Share post:

Latest