రెజీనాకు `బాహుబ‌లి` నిర్మాత‌లు బంప‌ర్ ఆఫ‌ర్‌?

`శివ మనసులో శృతి` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన‌ రెజీనా కాసాండ్రా.. రొటీన్ లవ్ స్టోరీతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ త‌ర్వాత మెగా హీరో సాయి ధరమ్ తేజ్ స‌ర‌స‌న‌ పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్ లాంటి చిత్రాల్లో నటించి త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.

- Advertisement -

ఇక తెలుగుతో పాటు త‌మిళ్‌, క‌న్న‌డ చిత్రాల్లోనూ ఈ బ్యూటీ న‌టించింది. అయితే ప్ర‌స్తుతం మాత్రం ఈమె కెరీర్ పూర్తిగా డ‌ల్ అయిపోయింది. `నేనా నా` అనే సినిమా మిన‌హా.. తెలుగులో మ‌రే చిత్రానికి రెజీనా సైన్ చేయ‌లేదు. ఇలాంటి త‌రుణంలో బాహుబ‌లి వంటి సూప‌ర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన‌ నిర్మాత‌లు శోభు యార్ల‌గ‌డ్డ‌, ప్ర‌సాద్ దేవినేనిలు తాజాగా రెజీనాకు బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చార‌ట‌.

సినిమాతో పాటు బుల్లితెర‌పై భారీ సీరియ‌ల్స్‌ను నిర్మిస్తూ దూసుకుపోతున్న‌ బాహుబ‌లి నిర్మాత‌లు త్వ‌ర‌లోనే ఓ వెబ్ సిరీస్‌ను నిర్మించ‌డానికి ప్లాన్ చేసుకుంటున్నార‌ట‌. హార‌ర్ జోన‌ర్‌లో తెర‌కెక్క‌బోయే ఈ వెబ్ సిరీస్‌లో రెజీనాను ఎంపిక్ చేశారు. ఇప్ప‌టికే సంప్ర‌దింపులు కూడా పూర్తి అయ్యాయ‌ని.. త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న కూడా ఉంటుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

Share post:

Popular