ఆర్ఆర్ఆర్‌, ఆచార్య రికార్డుల‌ను బ‌ద్ద‌లుకొట్టిన బాల‌య్య‌!

నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో `అఖండ‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శర వేగంగా జరుగుతుంది.

ఇక‌ కొద్ది నెలల క్రితం చిత్ర గ్లింప్స్‌ని విడుదల చేయగా.. ఉగాది సందర్భంగా సినిమా టైటిల్ అనౌన్స్ చేస్తూ టీజ‌ర్ విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ టీజ‌ర్‌లో బాలయ్య లుక్.. మాస్ డైలాగ్స్‌ ఇలా ప్రతీ అంశం ప్రేక్షకుల‌ను ఆక‌ట్టుకుంది. దీంతో ఈ టీజ‌ర్ యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. ఫ‌లితంగా అర్ఆర్ఆర్, ఆచార్య రికార్డుల‌ను బాల‌య్య చిత్తు చిత్తు చేశారు. అవును, 25 గంటల్లోనే 12 మిలియన్ వ్యూస్ సాధించిన అఖండ టీజ‌ర్.. కేవ‌లం ఐదు రోజుల్లోనే ఏకంగా 25 మిలియన్ వ్యూస్ రాబ‌ట్టింది.

గతంలో ఆర్ఆర్ఆర్ మోషన్ పోస్టర్ వీడియోకు నెలకు ఏడు మిలియన్ వ్యూస్ వచ్చాయ్. ఆతర్వాత వచ్చిన ‘భీమ్ ఫర్ రామరాజు’ టీజర్ కు కూడా నెలలో 12 మిలియన్ వ్యూస్ వచ్చాయ్. ఇక జ‌న‌వ‌రి చివ‌ర్లో విడుద‌లైన ఆచార్య టీజ‌ర్.. రెండు నెల‌లు గ‌డిచిపోయినా‌ 19 మిలియ‌న్ వ్యూస్ మాత్రమే రాబ‌ట్ట‌గ‌లిగింది. కానీ, వీరి రికార్డులు బ్రేక్ చేస్తూ.. కేవ‌లం ఐదు రోజుల్లో 25 మిలియన్ వ్యూస్ సాధించింది. దీని బ‌ట్టీ చూస్తే.. బాల‌య్య మ్యాని‌యా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవ‌చ్చు.