రేపటి నుంచి ఏపీలో స్కూల్స్ బంద్…!

ప్రస్తుతం భారతదేశంలో కరోనా వైరస్ రెండవసారి ఎలా వ్యాపిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఎన్ని అనేక ప్రాంతాలలో లాక్ డౌన్ విధిస్తూ పెద్ద ఎత్తున ఆకాంక్షలను విధిస్తున్నారు. ఇక అసలు విషయంలోకి వెళితే.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకి కరోనా కేసులు ఉగ్రరూపం దాల్చడంతో జగన్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే..

 

తాజాగా ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ రేపటి నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలో ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు సెలవులను ప్రకటించారు. అయితే టెన్త్, ఇంటర్ పరీక్షలు మాత్రం ప్రస్తుతానికి యథాతథంగా కొనసాగుతాయని ఆయన తెలియజేశారు. ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఈ సంవత్సరం సంబంధించి ఇకపై ఎలాంటి పరీక్షలు ఉండవని నేటితో వారి విద్యా సంవత్సరం పూర్తయినట్లు మంత్రి స్పష్టంగా తెలియజేశారు. ఇక టెన్త్, ఇంటర్ విద్యార్థులకు సంబంధించి కచ్చితమైన నిబంధనలు పాటించి పాఠశాలకు హాజరు కావాలని మంత్రి వెల్లడించారు.

Share post:

Latest