అనుపమ పరమేశ్వరన్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. తక్కువ సమయంలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ కేరళ ముద్దుగుమ్మకు విస్కీ అంటే పిచ్చ ఇష్టమట. ఈ విషయాన్ని స్వయంగా ఆమెనే సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.
అయితే విస్కీ అంటే తాగేది కాదండోయ్.. అనుపమ పెంచుకునే కుక్క. తను ఎంతో ముద్దుగా పెంచుకుంటున్న కుక్క పిల్ల విస్కీ నాలుగో పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా విస్కీతో దిగిన ఫొటోలు అభిమానులతో పంచుకుంది.
`నా విస్కీ బేబీ నాలుగేళ్లు పూర్తి చేసుకుంది. గడిచిన రెండేళ్లలో విస్కీ ఇద్దరు సోదరులు టడ్డీ, రమ్లను కోల్పోయాం. ఆ బాధ నుంచి విస్కీ వల్ల బయట పడ్డాం. మా జీవితాలను అద్భుతంగా మార్చినందుకు విస్కీకి కృతజ్ఞతలు. హ్యాపీ బర్త్డే విస్కీ.. మేము నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాం. నువ్వు నా దానివి.. నా దానివి మాత్రమే` అంటూ అనుపమ కామెంట్స్ కూడా చేసింది. దీంతో అనుపమ పోస్ట్ వైరల్గా మారింది.
https://www.instagram.com/p/COCcqbMpGQ3/?utm_source=ig_web_copy_link