పటాస్ 2 షో ద్వారా యాంకర్ గా రీ ఎంట్రీ ఇచ్చిన అందాల భామ వర్షిణి తెర పై కనిపించింది అంటే ఆమె అభిమానులకు ఇంకా పండుగే పండుగ. ముద్దు ముద్దు మాటలతో, అందమైన నవ్వుతో యువత గుండెల్లో నిద్ర లేకుండా చేస్తున్న ఈ బ్యూటీ భామ అటు టీవీ రియాలిటీ షోలతోనూ, ఇటు వెబ్ సిరీస్ లతోనూ ఫుల్ బిజీగా ఉంది. మోడలింగ్ ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన బ్యూటీ వర్షిణికి తెలుగు ప్రేక్షకుల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ముక్యంగా తన అండ చందాలకు ఇంకా డాన్స్ కి కుర్రకారు ఫిదా అవుతుంటారు.
వర్షిణి మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. శంభో శివ శంభో చిత్రంలో చిన్న పాత్ర చేసింది.ఆ తరువాత జాతీయ పురస్కారం గెలుచుకున్న చందమామ కథలు సినిమాలో కూడా వర్షిణి నటించింది. ఆమె లవర్స్ , కాయ్ రాజా కాయ్ , బెస్ట్ యాక్టర్స్ వంటి చిత్రాలలో నటనకుగాను మంచి పేరు తెచ్చుకుంది. తాజాగా బికినీలో ఢీ భామ అయిన యాంకర్ వర్షిణి కెమెరా కి పోజ్‌లు ఇస్తూ యువతని కేక పెట్టిస్తోంది.