ఓటేసేందుకు వ‌చ్చి అభిమాని ఫోన్ లాక్కున్న అజిత్‌..వీడియో వైర‌ల్‌!

త‌మిళ‌నాడు రాష్ట్రంలో నేటి ఉద‌యం ప్రారంభ‌మైన అసెంబ్లీ ఎన్నిక‌లు జోరుగా కొన‌సాగుతున్నాయి. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయ‌గా.. సామాన్యు‌లతో పాటు సెల‌బ్రెటీలు కూడా త్వ‌ర‌త్వ‌ర‌గా వ‌చ్చి ఓటు హ‌క్కును వినియోగించుకుంటున్నారు.

ఈ క్ర‌మంలోనే కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్.. భార్య షాలినీ కుమార్‌తో పాటు ఓటు వేసేందుకు తిరువాన్మయూర్ కి ఉద‌యాన్నే వ‌చ్చారు. అయితే ఈ విష‌యంలో తెలుసుకున్న స్థానికులు, అభిమానుల‌కు క‌రోనాను లెక్క‌చేయ‌కుండా పోలింగ్ కేంద్రం వ‌ద్ద‌కు చేరుకుని.. అజిత్‌ను చుట్టేశాడు. పోలీసులు ఎంత అదుపు చేస్తున్నా.. ఆయ‌న‌తో ఫొటోలు తీసుకునేందుకు ఎగ‌బ‌డ్డారు.

దీంతో ఎప్పుడూ శాంతంగా ఉండే అజిత్‌.. ఆగ్ర‌హానికి లోనై ఎగబడుతున్న అభిమానుల్లో ఒకరి ఫోన్ ను లాక్కుని జేబులో పెట్టుకున్నారు. ఈ క్ర‌మంలోనే తనకు దూరంగా వెళ్లాలంటూ వారిపై మండిప‌డ్డారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. ‌

Share post:

Latest