వారి కోసం అంబులెన్స్ డ్రైవ‌ర్‌గా హీరో..!?

కరోనా బాధితులకు హెల్ప్ చేయడానికి ద‌క్షిణాది నటుడు ఒకరు అంబులెన్స్ డ్రైవర్‌గా మారిపోయారు. క‌రోనా పేషెంట్ల‌ను హాస్పిటల్ కి తీసుకెళ్ల‌డం, హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకెళ్ల‌డం వంటివి చేస్తూ అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నారు సౌతిండియాకు చెందిన న‌టుడు అర్జున గౌడ‌. యువ‌రాథ‌న‌, రుస్తోమ్ చిత్రాలతో మంచి ఇమేజ్‌ను సంపాదించుకున్న అర్జున గౌడ‌,  ప్రాజెక్ట్ స్మైల్ ట్ర‌స్ట్‌లో స‌భ్యుడిగా చేరి నిరేపేద‌ల‌కు సేవలు చేస్తున్నాడు.

- Advertisement -

క‌రోనా సోకిన వారిని హాస్పిటల్ కి తీసుకెళ్ల‌డం, చ‌నిపోయిన వారిని శ్మ‌శాన వాటిక‌కు తీసుపోవటం వంటివి చేస్తున్నాడు అర్జున. తాను సహాయం అందించేందుకు నగరం అంతటా ఎక్కడైనా వెళ్ళడానికి రెడీగా ఉన్నాను అని తెలిపారు. క‌రోనా వ్యాప్తి నేప‌థ్యంలో సినిమాల నిర్మాణం నిలిచిపోయినందున ఇక‌ పై ఇలాంటి సేవ‌ల‌కే త‌న టైంని వెచ్చిస్తాన‌ని, ఈ ర‌కం సేవ‌లు అందించ‌డంలో ఎంతో ఆనందం ఉన్న‌ద‌ని అర్జున్ గౌడ్ తెలిపాడు.

Share post:

Popular