అలనాటి ఫోటో పెట్టి తల్లికి బర్త్ డే విషెస్ తెలిపిన అభిషేక్ ..!

బాలీవుడ్ నటి, రాజకీయ నేత, బిగ్ బి అమితాబ్ భార్య అయిన జయాబచ్చన్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా తన కుమారుడు అయిన అభిషేక్ తన ఇన్స్టాగ్రామ్ లో పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ.. లవ్ యూ అంటూ జయాబచ్చన్ అలనాటి ఫోటో పెట్టి పోస్ట్ చేశారు. ఆ ఫొటోలో జయాబచ్చన్ చాలా అందంగా, చూడ ముచ్చటగా కన్పిస్తూ నెటిజన్లను ఆకర్షిస్తున్నారు. జయాబచ్చన్ బర్త్ డే సందర్భంగా ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా లో హల్చల్ చేస్తుంది.

అభిషేక్ బచ్చన్ తన తల్లి జయాబచ్చన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆ పిక్ ను పోస్ట్ చేయగానే బాలీవుడ్ ప్రముఖులు అందరు జయాబచ్చన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. హృతిక్ రోషన్ హ్యాపీ బర్త్ డే ఆంటీ అంటూ పోస్ట్ పెట్టారు. ఇక ప్రస్తుతం కరోనా కేసుల పెరుగుదల కారణంగా జయాబచ్చన్ పుట్టినరోజు వేడుకలు వారి ఇంటిలోనే కుటుంబ సభ్యులతో జయ జరుపుకోనున్నారు.

Share post:

Latest