కరోనా కలకలం: సుప్రీంకోర్టులో 50శాతం మందికి కరోనా..!?

సుప్రీంకోర్టులో మొదలయిన కరోనా విజృంభన. దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానంలో క‌రోనా బీభత్సం సృష్టించింది. సుప్రీంకోర్టులో 50 శాతం మంది సిబ్బంది ఈ కరోనా మ‌హ‌మ్మారి బారిన ప‌డ్డారు. దీంతో ఇక మీదట కేసుల‌ను వీడియో కాన్ఫ‌రెన్సింగ్ ద్వారా ఇంటి నుండే నిర్వ‌హించాల‌ని న్యాయ‌మూర్తులు నిర్ణ‌యించిన‌ట్లు తెలుస్తుంది.

ప్ర‌స్తుతం కోర్టురూమ్‌ ‌తోపాటు సుప్రీంకోర్టు ఆవ‌ర‌ణ మొత్తాన్నీ శానిటైజ్ చేసారు. కోర్టులోని అన్ని కేసులు ఒక గంట ఆల‌స్యంగా విచార‌ణ మొద‌లు కానున్నాయి. ఇండియాలో క‌రోనా రెండో వేవ్ నడుస్తున్న క్రమంలో ఈమధ్య కరోనా బాగా ఉద్ధృతంగా ఉంది. గ‌త కొద్దీ రోజుల్లోనే కొత్త‌గా ప‌ది ల‌క్ష‌ల కేసులు నమోదు అయ్యాయి. ఆదివారం నాడే ల‌క్ష‌న్న‌ర‌కు పైగా కేసులు రావ‌డం తో అందరిలో తీవ్ర ఆందోళ‌న నెలకొంది. రోజువారీ కేసుల్లో ప్ర‌పంచంలోనే అత్య‌ధిక కేసులు మన ఇండియాలోనే నమోదు అవుతున్నాయి.

Share post:

Popular