మ్యూజిక్ డైరెక్టర్ గా మారబోతున్న 14 సంవత్సరాల బాలుడు…!?

14 సంవత్సరాల వయసు అంటే తొమ్మిదో తరగతి చదువుతుంటారు. అలాంటి ఓ కుర్రాడు గిటార్ మోగిస్తేనే వావ్ అనిపిస్తుంది. అలాంటిది తాను ఏకంగా సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అయిపోతే పెద్ద సంచలనమే. ఆ సంచలనానికి కారణం ప్రముఖ ప్రొడ్యూసర్ ఎంఎస్ రాజు. ఆయన నుంచి మరో చిత్రం రాబోతోంది. ఆ చిత్రం పేరు 7 డేస్ 6 నైట్స్. ఈ చిత్రంతో 14 సంవత్సరాల బాలుడిని మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయం చేయనున్నారు ఎంఎస్ రాజు.

ఇంతకీ ఆ 14 ఎల్లా బాలుడు ఎవరంటే, తన పేరు సమర్థ్ గొల్లపుడి. ఇప్పటికే యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రేక్షకులకు తన మ్యూజిక్ ద్వారా మెప్పించి ప్రశంసలు పొందుతున్నాడు సమర్థ్. అతని సంగీతానికి ఫ్యాన్స్ కూడా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అలాంటి సమర్థ్ ను ఏకంగా సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ను చేస్తున్నారు ప్రొడ్యూసర్ ఎంఎస్ రాజు. 7 డేస్ 6 నైట్స చిత్రం ఎలాంటి సంచలనం చేస్తుందో వేచి చూడాలి.

Share post:

Popular