స్పా ముసుగులో వ్య‌భిచార దందా..!

సులువుగా డ‌బ్బు సంపాదించేందుకు అక్ర‌మ మార్గం ప‌డుతున్నారు. నీచ కార్యాల‌కు తెగ‌బ‌డుతున్నారు. వ్య‌భిచార రొంపిలోకి దిగుతున్నారు. అందుకు ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తుంది ఈ సంఘ‌ట‌న‌. అహ్మదాబాద్ కు చెందిన ఒక ముఠా స్థానిక బిజినెస్ కాంప్లెక్స్‌లో గోల్డెన్ స్పా పేరుతో వ్యభిచార దందాను కొంత‌కాలంగా గుట్టుగా నిర్వ‌హిస్తున్న‌ది. ఈ మేర‌కు స‌మాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదును చూసి దాడి చేశారు. లోపల శృంగార కార్యకలాపాల్లో మునిగి తేలుతున్న పలువురు యువతులను, విటులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దాడి విషయం తెలుసుకున్న ముఠా అసలు సూత్రధారుడు జిగ్నేష్ పరారుకాగా, స్పా నిర్వాహకులైన ముగ్గురితో సహా పలువురిని అదుపులోకి తీసుకున్నారు. స్పాలో దాడి సందర్భంగా నగదుతో పాటు, పట్టుబడ్డ యువతీ యువకుల సెల్‌ఫోన్స్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

 

అదేవిధంగా నోయిడా లోని సెక్టార్ 24 ప్రాంతంలో స్పా సెంటర్ కొందరు వ్యక్తులు గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచార గృహాన్ని కొనసాగిస్తున్నారు. విశ్వసనీయ సమచారం మేరకు అర్ధరాత్రి కూడా మసాజ్ సెంటరులో విటులు వస్తూ పోయోవారు. దీంతో మసాజ్ సెంటర్ పై పోలీసులు డికాయ్ ఆపరేషన్ నిర్వహించి దాడులను నిర్వహించారు. ఈ దాడుల్లో వెస్ట్ బెంగాల్‌, నేపాల్ కు చెందిన న‌లుగురు అమ్మాయిలతోపాటు విటులను రెడ్ హ్యాండెడ్‌గా పోలీసులు పట్టుకున్నారు. ఈ క్రమంలోనే మసాజ్ సెంటర్ లో నిర్వహకుడు నితిన్, అందులో పనిచేసే బీహార్‌కు చెందిన రాజ్ కుమార్ ఠాకూర్‌లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా, వారు నేరాన్ని అంగీకరించారు. ముగ్గురు నిందితులను ఆరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిచారు. పోలీసుల కథనం ప్రకారం.

Share post:

Popular