స్కై బ్లూ డ్రెస్ లో మతేక్కిస్తున్న సారా..!

సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ త‌న అభిమానులకు ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ ఇస్తూ ఉంటుంది బాలీవుడ్మ బ్యూటీ సారా అలీఖాన్‌. ఈ అందాల భామ ఎప్పుడు, ఎలాంటి డ్రెస్‌లో క‌నిపిస్తుందో ఎవరు చెప్పలేరు. పంజాబీ డ్రెస్‌, షార్ట్ డ్రెస్‌, ట్రెండీ కాస్ట్యూమ్స్ లో క‌నిపిస్తూ ఎప్పటికప్పుడు సంద‌డి చేసే సారా ఈ సారి స్కై బ్లూ అంటే నీలాకాశం రంగు డ్రెస్‌లో మెరిసిపోయి అలరించింది.

66 ఫిలిం ఫేర్ అవార్డుల కోసం ఆడ్నేవిక్ డిజైన్ చేసిన నీలి రంగు గౌన్‌లో సిల్వ‌ర్ సాండ‌ల్స్, రింగ్స్ పెట్టుకుని‌ గార్జియ‌స్ లుక్‌లో క‌నిపిస్తూ సారా పోజులిచ్చింది. ఈ ఫొటోల‌ను షేర్ చేస్తూ సిండ‌రెల్లా స్టోరీ అంటూ క్యాప్ష‌న్ పెట్టి, ఎమోజీల‌ను కూడా పోస్ట్ చేసింది. ప్ర‌స్తుతం అక్ష‌య్‌కుమార్‌, ధ‌నుష్ తో క‌లిసి అట్రాంగి రే చిత్రం చేస్తోంది బ్యూటీ భామ సారా అలీఖాన్‌.