దేవుడా .. ఏకంగా 8 మందిని పెళ్లి చేసుకున్న యువకుడు…ఎక్కడంటే..!?

విశాఖలో ఒక నిత్య పెళ్లి కొడుకు అరాచకాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 8 మందిని పెళ్లి చేసుకొని పోలీసులకు అడ్డంగా దొరికిన నిత్య పెళ్లికొడుకు. ఏకంగా 8 మందిని ప్రేమ వివాహం చేసుకున్నాడు అరుణ్‌ కుమార్ అనే వ్యక్తి. తీరా పెళ్లి చేసుకున్నాక, వాళ్ళను వ్యభిచారం చేయాలంటూ ఒత్తిడి తెచ్చేవాడు. అరుణ్‌ కుమార్ తమని వ్యభిచారం చేయాలంటూ ఒత్తిడి చేసేవాడని బాధితులు ఆరోపిస్తున్నారు.

మొదటి భార్య కుమార్తెను కూడా వ్యభిచార ముఠాకు అమ్ముతానంటూ వేధింపులకు గురి చేసేవాడు. తన మాట వాళ్ళు వినకపోతే తుపాకులు, కత్తులతో బెదిరింపులకు పాల్పడటం వంటివి చేసేవాడు. దీనితో బాధితురాలు కంచరపాలెం పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీస్ వారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కేసు విచారించగా పోలీసులకు అసలు విషయాలు తెలిసాయి. అరుణ్‌ కుమార్‌కు గంజాయి, వ్యభిచారముఠాలతో పలు లింకులు ఉన్నట్లు కూడా తెలుస్తోంది.

Share post:

Popular