రెజీనాలో ఈ ట్యాలెంట్ కూడా ఉందా..ఆశ్చ‌‌ర్య‌పోతున్న నెటిజ‌న్లు!

రెజీనా కాసాండ్రా.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `శివ మనసులో శృతి` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన రెజీనా.. కొత్త జంట, పిల్ల నువ్వు లెని జీవితం, ప‌వ‌ర్ వంటి చిత్రాల‌తో గుర్తింపు తెచ్చుకుంది. ఇక సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాతో మంచి హిట్ అందుకున్న ఈ బ్యూటీ.. తెలుగుతో పాటు త‌మిళ్‌, క‌న్న‌డ భాష‌ల్లోనూ న‌టించింది.

- Advertisement -

Regina on her win in the standup paddle race: I was ambushed into participating! | Tamil Movie News - Times of India

ప్ర‌స్తుతం కార్తీక్‌ రాజు దర్శకత్వంలో ‘నేనేనా’ అనే చిత్రంతో పాటు మ‌రి కొన్ని ప్రాజెక్ట్స్‌లో కూడా రెజీనా న‌టిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా రెజీనా త‌న కొత్త ట్యాలెంట్‌ను బ‌య‌ట పెట్టింది. ఓ మూవీ షూటింగ్ కోసం ఇటీవ‌ల చెన్నై వెళ్లింది రెజీనా. అయితే ఆ షూటింగ్ క్యాన్సిల్ అవ్వ‌డంతో కోవ‌లం అనే ప్ర‌దేశంలో స‌ర్ఫ్ ట‌ర్ఫ్ ఆధ్వర్యంలో న‌డిచిన‌ స్టాండ‌ప్ పెడ‌ల్ రేస్‌లో పాల్గొంది.

స్టాండప్ పెడల్ బోర్డ్ రేసింగ్ లో విజేతగా రెజీనా!

సాధార‌ణంగా ఈ రేస్‌లో సముద్రం అలలు తట్టుకుని నిలబడటమే ఓ విజయం. అలాంటిది ఈ రేస్‌లో పాల్గొని విజేతగా నిలిచింది. ఉమెన్స్ టెక్నికల్ రేస్ లో అగ్రస్థానాన్ని రెజీనా దక్కించుకుంది. చివ‌రి నిమిషంలో ఈ రేస్‌లో పాల్గొన్నాన‌ని కానీ బెస్ట్ ఎక్స్‌పీరియ‌న్స్ అంటూ ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేసింది. ఇక రెజీనా కొత్త ట్యాలెంట్ చూసి నెటిజ‌న్లు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఈ క్ర‌మంలోనే ఆమె వీడియోపై లైకులు, కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

https://www.instagram.com/p/CM9f5wilWqj/?utm_source=ig_web_copy_link

Share post:

Popular